Thursday, November 27, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలి

రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలి

- Advertisement -

– ప్రొఫెసర్‌ వి.బాలకిష్టారెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ప్రొఫెసర్‌ వి.బాలకిష్టారెడ్డి సూచించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో తొలిసారిగా రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయ సిబ్బంది, తదితరులతో రాజ్యాంగ పీఠికను చదివించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం తెలియకపోవడం, తెలిసి నిర్లక్ష్యం చేయడం తగదని హితవు పలికారు. రాజ్యాంగం ప్రతి పౌరునికి స్ఫూర్తినిస్తుందన్నారు. రాజ్యాంగ బద్ధంగా విలువలతో జీవించడం పౌరుల బాధ్యత అని గుర్తుచేశారు. లౌకికవాదం, సార్వభౌమత్వం, ప్రజాస్వామ్యం, సమాన హక్కులు రాజ్యాంగం మనకిచ్చినవని తెలిపారు. మండలి వైస్‌ చైర్మెన్‌ ప్రొఫెసర్‌ ఇ.పురుషోత్తం మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రక్షించాల్సిన, పాటించాల్సిన బాధ్యత మనందరిదని తెలిపారు. కార్యదర్శి ప్రొఫెసర్‌ శ్రీరాం వెంకటేష్‌ మాట్లాడుతూ మారుతున్న పరిస్థితుల్లో ఏఐ, డిజిటల్‌ వంటివి దుర్వినియోగం కాకుండా చట్టాలు రావాల్సిన అవసరముందని తెలిపారు. సీనియర్‌ పాత్రికేయులు మంద భుజేందర్‌ మాట్లాడుతూ ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం మనదని తెలిపారు. అయితే ఆ రాజ్యాంగం అమలులో మాత్రం చాలా వెనకబడి ఉన్నామని తెలిపారు. రాజ్యాంగాన్ని వందశాతం అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తుచేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -