- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హన్వాడ మండలం పిల్లిగుండు గ్రామంలోని ఎన్‌హెచ్-16పై ఇథనాల్ ట్యాంకర్, లారీ ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇథనాల్ ట్యాంకర్ పూర్తిగా దగ్ధమైంది. లారీ డ్రైవర్ సజీవదహనమయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను ఆర్పివేశారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
- Advertisement -



