– 6S ఆటోమొబైల్స్ ఇండియా ప్రై. లి. ను నిజామాబాద్ లో అధీకృత సర్వీస్ భాగస్వామిగా నియమించింది
నవతెలంగాణ నిజామాబాద్: నిజామాబాద్, తెలంగాణాలో తన కొత్త అధీకృత సర్వీస్ కేంద్రాన్ని ప్రారంభించిన ఇసుజు మోటార్స్ ఇండియా తన అమ్మకాల-అనంతర పాదముద్రలను విస్తరించింది. 6S ఆటోమొబైల్స్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ చే నిర్వహించబడే ఈ సదుపాయము మాధవ్నగర్ లో వ్యూహాత్మకంగా ఏర్పాటు చేయబడింది, తద్వారా వినియోగదారులు ఆ ప్రాంతములో ప్రాప్యత పొందడం సులభం చేసింది. ఈ చేరికతో, తెలంగాణాలో పెరుగుతున్న తన కస్టమర్ బేస్ కు సౌకర్యవంతమైన, విశ్వసనీయమైన, అధిక-నాణ్యత కలిగిన సర్వీస్ అనుభవాలను అందించాలనే తన నిబద్ధతను ఇసుజు మోటార్స్ ఇండియా పునరుద్ఘాటించింది.
కొత్త కేంద్రము ప్రాముఖ్యతను ప్రాధాన్యీకరిస్తూ, ఇసుజు మోటార్స్ ఇండియా నుండి ఉన్నతస్థాయి అధికారులు , 6S ఆటోమొబైల్స్ నుండి ప్రతినిధుఉ ఈ సదుపాయాన్ని ప్రారంభించారు , అమ్మకాల-అనంతర సేవను వినియోగదారులకు అందుబాటులోకి తేవటానికి ఈ బ్రాండ్ యొక్క నిరంతర ప్రయత్నాలలో మరొక దశను గుర్తించింది.
ఇసుజు మోటార్స్ ఇండియా డెప్యూటి మేనేజింగ్ డైరెక్టర్ తోరు కిషిమోటో ఈ సందర్భంగా మాట్లాడుతూ, “తెలంగాణా మాకు అత్యంత ముఖ్యమైన , వేగంగా-అభివృద్ధి చెందుతున్న మార్కెట్ గా నిలిచింది. నిజామాబాద్ లో కొత్త అధీకృత సర్వీస్ కేంద్రముతో, వినియోగదారులు సరైన సమయానికి, ఆధారపడగలిగేది , నాణ్యమైన సేవలను నిర్ధారించాలనే మా నిబద్ధతకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాము. ఈ ప్రాంతములో అందుబాటును పెంచుటకు , ఇసుజు యజమానులకు మరింత సమర్థవంతంగా సహకారాన్ని అందించుటకు ఈ కొత్త ఏఎస్సి వీలుకల్పిస్తుంది.” అని అన్నారు.

6S ఆటోమొబైల్స్ ఇండియా ప్రై. లి. డీలర్ ప్రిన్సిపల్ శ్రీకర్ కోయల మాట్లాడుతూ “ఇసుజు మోటార్స్ ఇండియాతో చేతులు కలపడం , ఇసుజు సర్వీస్ నైపుణ్యాన్ని నిజామాబాద్ కు తీసుకొనిరావడం మాకెంతో గర్వకారణంగా ఉంది. ఆధునిక పరికరాలు , సుశిక్షుతులైన వృత్తినిపుణుల సహకారముతో మా సదుపాయము అధిక నాణ్యతా ప్రమాణాలను , వినియోగదారుడి సంతృప్తిని అందించుటకు ఏర్పాటు చేయబడింది.” అని అన్నారు.
ఈ కొత్త సర్వీస్ కేంద్రములో సిజర్ లిఫ్ట్, పెయింట్ బూత్, మెకానికల్ బేస్, బాడీ షాప్ బేస్ తో కలిపి హైడ్రాలిక్ లిఫ్ట్స్ , విడిభాగాల దుకాణముతో సహా ఆధునిక మౌలికసదుపాయాలు ఉన్నాయి, ఇవి సమగ్రమైన నిర్వహణ , సర్వీస్ సహకారాన్ని అందిస్తాయి.



