Friday, November 28, 2025
E-PAPER
Homeమానవితక్కువ సమయంలో ఎక్కువ కేలరీలు….

తక్కువ సమయంలో ఎక్కువ కేలరీలు….

- Advertisement -

రోజూ వాకింగ్‌ చేయడం వల్ల ఒత్తిడి తగ్గడమే కాకుండా నిద్ర మెరుగుపడి మనసును తాజాగా ఉంచుతుంది. అందుకే మంచి ఆరోగ్యానికి వాకింగ్‌ చాలా అవసరమని చెబుతారు. అంతేకాకుండా, ప్రతిరోజూ వాకింగ్‌ చేయడం వల్ల బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి ప్రతిరోజూ కొంత సమయం వాకింగ్‌కు సమయం కేటాయించడం చాలా ముఖ్యం. అందరికీ సులభమైన వ్యాయామం ఏదైనా ఉందంటే అది వాకింగ్‌. కానీ తక్కువ టైంలో మనం ఎక్కవ కేలరీలు బర్న్‌ చేయాలంటే ఎలానో చాలా మందికి తెలియదు. కానీ ఇది చాలా సులభం, అదెలాగంటే మీరు నడిచే నడకలో కొన్ని మార్పులు చేయడం ద్వారా ఈజీగా తక్కువ టైంలో ఎక్కవ కేలరీస్‌ బర్న్‌ చేయొచ్చు. ఉదాహరణకు నడక వేగాన్ని పెంచడం ద్వారా ఎక్కవ కేలరీస్‌ బర్న్‌ చేయవచ్చు. ఇది మీ గుండె ఆరోగ్యానికి కూడా మంచిది.

వేగంగా నడిచినప్పుడు, హార్ట్‌బీట్‌ పెరుగుతుంది. అలాగే కండరాలు మరింత కష్టపడి పనిచేస్తాయి. ఇది ఒక మోస్తరు వ్యాయామంలా అనిపించినప్పటికీ, ఇది ఎక్కువ కేలరీలను బర్న్‌ చేస్తుంది.
వంపుతిరిగిన ప్రదేశాలలో నడవడం వల్ల కండరాలపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. కొండలపై, మెట్లపై లేదా ట్రెడ్‌మిల్‌పై లేదా వంపుతిరిగిన ప్రదేశాలపై నడిచినప్పుడు కోర్‌, గ్లూట్స్‌, హామ్‌ స్ట్రింగ్స్‌పై ఎక్కువగా ప్రభావం పడుతుంది. ఇది ఎక్కువ కేలరీలను బర్న్‌ చేయడానికి, కండరాల బలాన్ని పెంచడానికి సహాయపడుతుంది. పవర్‌ వాకింగ్‌ అంటే శక్తివంతమైన అడుగులు వేయడం.

మోచేతులను 90-డిగ్రీల కోణంలో ఊపుతూ నడవడం, ఇలా నడవడం ద్వారా హార్ట్‌బీట్‌ పెరుగుతుంది. అలాగే శరీర కండరాలను సక్రియం చేస్తుంది, ఇది కూడా ఎక్కువ కేలరీలను బర్న్‌ చేయడానికి సహాయపడుతుంది. ఇంటర్వెల్‌ వాకింగ్‌ అంటే ఒక నిమిషం వేగంగా నడవండి, ఆపై రెండు నిమిషాలు నెమ్మదిగా నడవండి. ఇంటర్వెల్‌ వాకింగ్‌ వల్ల హృదయ ఆరోగ్యం మెరుగుపడుతుంది, తక్కువ సమయంలో ఎక్కువ కేలరీలు బర్న్‌ అవుతాయి. వాకింగ్‌ చేసేప్పుడు చేతిలో తేలికైన ఏదైనా వస్తువులను పట్టుకోండి. మీ చేతిలో ఉండే ఈ అదనపు బరువు కేలరీల బర్నింగ్‌ను పెంచుతుంది. అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే కండరాలను అతిగా శ్రమించకుండా ఉండటానికి తేలికపాటి బరువులతో ప్రారంభించడం ముఖ్యం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -