Friday, November 28, 2025
E-PAPER
Homeఆటలుఫిట్‌నెస్‌ సాధించిన పాటిదార్‌

ఫిట్‌నెస్‌ సాధించిన పాటిదార్‌

- Advertisement -

ముస్తాక్‌ అలీ బరిలో ఎంపీ స్టార్‌

బెంగళూరు : రజత్‌ పాటిదార్‌ ఎడమ కాలు మోకాలు గాయం నుంచి కోలుకున్నాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో ఫిట్‌నెస్‌ పరీక్ష పాసైన రజత్‌ పాటిదార్‌.. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నమెంట్లో బరిలోకి దిగనున్నాడు. మధ్యప్రదేశ్‌ తరఫున దేశవాళీలో ఆడుతున్న రజత్‌ పాటిదార్‌.. మూడో రౌండ్‌ మ్యాచ్‌ నుంచి అందుబాటులోకి రానున్నాడు. మధ్యప్రదేశ్‌ తన మ్యాచ్‌లు కోల్‌కతాలో ఆడుతుండగా.. నేడు రజత్‌ పాటిదార్‌ కోల్‌కతలో జట్టుతో చేరనున్నాడు. ఆదివారం జరిగే మధ్యప్రదేశ్‌ మూడో మ్యాచ్‌లో రజత్‌ పాటిదార్‌ ఆ జట్టుకు కెప్టెన్సీ వహించనున్నాడు. పది రోజుల పాటు సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో రిహాబిలిటేషన్‌లో ఉన్న రజత్‌ పాటిదార్‌.. వైద్య బృందం నుంచి రిటర్న్‌ టూ ప్లే సర్టిఫికెట్‌ పొందాడు. నిరుడు సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నమెంట్‌లో మధ్యప్రదేశ్‌ రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -