రెండు రోజుల టెస్టుకు రిఫరీ రేటింగ్
దుబాయ్ : ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ తొలి యాషెస్ టెస్టు రెండు రోజుల్లోనే ముగియగా.. ఐసీసీ మ్యాచ్ రిఫరీ పిచ్‌కు ఏ రేటింగ్ ఇస్తాడనే ఆసక్తి ఇటు క్రికెట్ వర్గాల్లో, అటు అభిమానుల్లో కనిపించింది. తొలి రోజు 19 వికెట్లు కుప్పకూలిన పెర్త్ టెస్టు.. రెండో రోజులోనే ఫలితం తేలిపోయింది. ఛేదనలో ట్రావిశ్ హెడ్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. అయితే, ఈ పిచ్‌కు మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగాలె ‘వెరీ గుడ్’ అంటూ రేటింగ్ ఇచ్చాడు. ఐసీసీ రేటింగ్స్ ప్రకారం ఉత్తమ పిచ్‌కు అందించే రేటింగ్ ఇది. ‘గుడ్ క్యారీ, పరిమిత సీమ్ మూవ్‌మెంట్, నిలకడగా బౌన్స్, బ్యాట్‌కు బంతికి సరసమైన పోటీతత్వం’ ఇచ్చే పిచ్‌లకు ఐసీసీ వెరీ గుడ్ రేటింగ్ అందిస్తుంది. భారత్, దక్షిణాఫ్రికా పోటీపడిన కోల్‌కతా ఈడెన్ గారెన్డ్స్ టెస్టు పిచ్‌పై సైతం విమర్శలు రేగినా.. ఆ పిచ్ రేటింగ్ ఇంకా బయటకు వెల్లడి కావాల్సి ఉంది.



