రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా కె.సునీత, పి.జయలక్ష్మి
ముగిసిన రాష్ట్ర 5వ మహాసభ
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్
తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర 5వ మహాసభ ఆదిలాబాద్ జిల్లాలో రెండ్రోజులపాటు విజయవంతంగా జరిగింది. ఈ మహాసభలో నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా కె.సునీత, ప్రధాన కార్యదర్శిగా పి.జయలక్ష్మి, కోశాధికారిగా పి.మంగ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎం.పద్మశ్రీ, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఈ.వెంకటమ్మ, బి.స్వప్న, ఈ.ఏమెలమ్మ, ఎ.రజిత, ఆర్.త్రివేణి, జి.జ్యోతి, డి.సునీత, కె.సమ్మక్క, ఎస్.బాబాయి ఎన్నికయ్యారు. రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా బి.లలిత, జి.పద్మ, పి.రమ్య, పి.స్వర్ణ, ఎం.పద్మ, జి.శారద, జి.కవిత, పి.నాగమణి, టి.పార్వతి, బి.శోభ, ఇద్దరు కో ఆప్షన్, ఆఫీస్ బేరర్స్‌గా 27మంది ఎన్నికయ్యారు. రాష్ట్ర కమిటీ మొత్తం 50 మందితో ఎన్నికైందని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తెలిపారు.
తెలంగాణ అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



