కేప్‌టౌన్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపణలపై దక్షిణాఫ్రికా తీవ్రంగా ప్రతిస్పం దించింది. అమెరికాతో దౌత్య సంబంధాలను పునరుద్ధ రించేందుకు అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఆయన పరి పాలన అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, అధ్యక్షుడు ట్రంప్ తమ దేశం గురించి తప్పుడు సమాచారం, వక్రీకరణలు చేస్తూ.. దక్షిణాఫ్రికాపై శిక్షాత్మక చర్యలను ప్రయోగిస్తున్నారని గురువారం అధికారికంగా విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇచ్చిన శిఖరాగ్ర సమావేశం అత్యంత విజయ వంతమైన సమావేశాలలో ఒకటిగా ఆయన అభివర్ణించారు. పలు తీవ్రమైన సవాళ్లకు ప్రతిస్పందనగా బహుపాక్షికత యొక్క తిరుగులేని బలం, విలువను ధృవీకరించే ఒక ప్రకటనను శిఖరాగ్ర సమావేశం రూపొందించిందని అన్నారు. దక్షిణాఫ్రికా జి20లో పూర్తిస్థాయి, చురుకైన మరియు నిర్మాణాత్మక సభ్యదేశంగా పాల్గొంటూనే ఉంటుందని అన్నారు. జి20 సభ్యులందరూ ఆ నిర్మాణాలన్నింటిలోనూ సమాన హోదాలో పాల్గొనేలా, ఏకాభిప్రాయం ఆధారంగా బహుపాక్షికత స్ఫూర్తితో దాని నిరంతర కార్యకలాపాలను పునరుద్ఘాటించాలని తాము పిలుపునిస్తున్నామని అన్నారు. వచ్చే ఏడాది ఫ్లోరిడాలోని గ్రేట్ సిటీ ఆఫ్ మయామిలోనిర్వహించే 2026 జి20కి దక్షిణాఫ్రికాకు ఆహ్వానం అందదని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ట్రంప్ ఆరోపణలపై దీటుగా స్పందించిన దక్షిణాఫ్రికా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



