మంత్రి జూపల్లి కృష్ణారావు
పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని రాష్ట్ర పర్యాటక, పురావస్తు, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రతియేటా ప్రతిష్టాత్మ కంగా హైదరాబాద్‌లో జరిగే ఈ పుస్తక మహోత్సవానికి సంబం ధించిన పోస్టర్‌ను గురువారం మంత్రి తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా మంత్రి జూపల్లికష్ణా రావు మాట్లాడుతూ పూర్వ కాలపు సాహితీవేత్తలు రచించిన సమాజ హిత పుస్తకాలను సేకరించాలని బుక్ ఫెయిర్ నిర్వాహకులకు మంత్రి జూపల్లి సూచిం చారు. వీటిని ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సుమారు రూ. కోటి వెచ్చించి కొనుగోలు చేస్తుం దని తెలిపారు. ఆనాటి మహాను భావులు రచించిన అటువంటి పుస్తకాలను ప్రతి గ్రామంలో, గ్రామ పంచాయతీలో, మహిళా పంచాయతీల్లో, గిరిజన ప్రాంతాల్లో అందుబాటులో ఉంచేలా ప్రయత్నిం చాలని అన్నారు. ఈతరహా ముఖ్యమైన పుస్తకాలను సేకరించే పనిలో బుక్‌ఫెయిర్ నిర్వాహకులు నిమగమవ్వాలని ఆయన స్పష్టం చేశారు.
నూతన రచయితలకు ప్రత్యేక స్టాళ్లు:నిర్వాహకులు
రాష్ట్రంలోని ప్రముఖ సాహితీ వేత్తలు, నూతన రచయితలను ప్రోత్సహించేందుకు ప్రదర్శనలో వారికి ప్రత్యేక స్టాళ్లను ఉచితంగా కేటాయిం చాలని నిర్వాహక కమిటీ నిర్ణయించింది.
ఈసారి గత సంవత్సరం కంటే అదనంగా స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రచురణకర్తలు పాల్గొంటారని తెలియజేసింది. ఈ ఏడాది బుక్‌ఫెయిర్‌ను ఇందిరాపార్క్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని నిర్వాహకులు చెప్పారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు కవి యాకూబ్, ప్రధాన కార్యదర్శి ఆర్. వాసు, ఉపాధ్యక్షుడు బాల్‌రెడ్డి, కోశాధికారి నారాయణరెడ్డి, శ్రీనివాస్, దినకర్, జర్నలిస్ట్ ఆజమ్‌ఖాన్ పాల్గొన్నారు.



