Friday, November 28, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవారికి టెట్‌ నుంచి మినహాయింపునివ్వాలి

వారికి టెట్‌ నుంచి మినహాయింపునివ్వాలి

- Advertisement -

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఎమ్మెల్సీ మల్క కొమురయ్య లేఖ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
2010కి ముందు నియమితులైన ప్రభుత్వ ఉపాధ్యాయులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టెట్‌ అర్హత విధానం నుంచి మినహాయింపునివ్వాలని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య కోరారు. ఈ మేరకు గురువారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు లేఖ రాశారు. 2010కి ముందు నియమితులైన టీచర్లకు టెట్‌ నుంచి ఉన్న మినహాయింపును ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుతో కోల్పోయారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 2009లో అమల్లోకి వచ్చిన పిల్లల ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టంలో 2010 మార్చి 31 తర్వాత నియమితులైన ఉపాధ్యాయులకు మాత్రమే టెట్‌ అర్హతను తప్పనిసరి చేసిందని స్పష్టం చేశారు. 2010కి ముందు నియమితులైన వారికి ఈ నిబంధన వర్తించదని ఆ చట్టంలో ఉందని గుర్తు చేశారు.

అయినప్పటికీ, వివిధ కోర్టు తీర్పులు, కేంద్ర మార్గదర్శకాల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం 2010కి ముందు నియమితులైన ఉపాధ్యాయులకు కూడా టెట్‌ అర్హత పరీక్షను తప్పనిసరి చేయడంతో రాష్ట్రంలో ఉన్న వేలాది మంది అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఒత్తిడికి, ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. దశాబ్దాలుగా సేవలందిస్తున్న టీచర్లపై ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానాన్ని తిరోగమన చట్ట ప్రక్రియ ద్వారా అమలు చేయడం సహజ న్యాయ సిద్ధాంతాలకు పూర్తిగా విరుద్ధం అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఉపాధ్యాయుల గౌరవం, సేవా భద్రత, మానసిక ఆరోగ్యం, వారి కుటుంబాల భవిష్యత్తును దష్టిలో ఉంచుకుని మినహాయింపునివ్వాలని ఆ లేఖలో అభ్యర్థించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -