నవతెలంగాణ – కంఠేశ్వర్
ఎన్నికల సందర్బంగా ర్యాలీలు నిర్వహించాలి అంటే సంబందించిన అధికారుల అనుమతి తప్పనిసరి అని, డి.జే లు పూర్తిగా నిషేధం గలదు పోలీస్ కమీషనర్ సాయి చైతన్య తెలిపారు. నిజామాబాదు జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల సందర్బంగా ఎవరైనా ర్యాలీ లు నిర్వహించాలి అనుకుంటే సంబందించిన రిటర్నింగ్ అధికారి పోలీస్ అధికారుల అనుమతి తప్పనిసరిగా ఉండాలి. అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించడం చట్టపరమైన చర్యలకు కారణమవుతుంది. కాబట్టి ప్రతి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నిర్వహకులు నియమాలను పాటించి, ఎన్నికల ప్రక్రియ సవ్యంగా సాగేందుకు పోలీసు శాఖకు సహకరించాలని కోరుకుంటున్నాం అని తెలియజేశారు. అదే విధంగా నిజామాబాద్ జిల్లా లో డి.జే లు వాడకం పూర్తిగా నిషేధం.శాంతి భద్రతలు, ప్రజాస్వామ్య వ్యవస్థ రక్షణలో అందరి భాగస్వామ్యం అత్యంత కీలకం అని నిజామాబాదు పోలీస్ కమీషనర్ శ్రీ పి. సాయి చైతన్య తెలియజేయడం జరిగింది.
ఎన్నికల ర్యాలీకి పోలీసుల అనుమతి తప్పనిసరి: సీపీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



