-సీపీ విజయ్ కుమార్ సూచన
-ఠాణాలో పలు రికార్డుల తనిఖీ
నవతెలంగాణ-బెజ్జంకి
వాహనాల తనిఖీల్లో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని సీపీ విజయ్ కుమార్ ఎస్ఎస్ టీ సిబ్బందికి సూచించారు. స్థానిక ఎన్నికల ప్రక్రియలో మండల పరిధిలోని తోటపల్లి గ్రామ శివారులో ఏర్పాటుచేసిన ఎస్ఎస్ టీ శిబిరాన్ని సీపీ విజయ్ కుమార్ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఎస్ఎస్ టీ శిబిరంలోని సిబ్బంది పారదర్శకంగా విధులు నిర్వర్తిస్తూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సీపీ తెలిపారు.
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు:సీపీ
ఎన్నికల దృష్ట్యా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని సీపీ విజయ్ కుమార్ ఠాణా సిబ్బందిని హెచ్చరించారు. మండల కేంద్రంలోని ఠాణాను సీపీ ఆకస్మికంగా సందర్శించి పరిసరాలను పరిశీలించారు.ఠాణాలో రికార్డులను తనిఖీ చేశారు. ఎన్నికల నిర్వహణలో పోలీస్ శాఖ ప్రధాన భూమికని..పాత నేరస్తులపై నిఘా పెట్టి బైండోవర్లు చేపట్టాలని సీపీ సూచించారు. సీఐ శ్రీను,ఎస్ఐ సౌజన్య,ఠాణా సిబ్బంది పాల్గొన్నారు.


