Friday, November 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొయ్యుర్ లో ఘనంగా పూలే వర్థంతి వేడుకలు.!

కొయ్యుర్ లో ఘనంగా పూలే వర్థంతి వేడుకలు.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
బడుగు, బలహీన వర్గాల ఆశయజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు మండలంలోని కొయ్యుర్ శుక్రవారం ఘనంగా నిర్వహించినట్లుగా జ్యోతిరావు పూలే విగ్రహ నిర్మాణ కమిటీ చైర్మన్ విజయగిరి సమ్మయ్య తెలిపారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం, అంటరానితనాన్ని, అసమానతలు లేని సమాజ నిర్మాణం కొరకు కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త పూలేని కొనియారు. పోరాటమే జీవితంగా త్యాగం చేశాడని, ఆయన ఆశయాలను కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో లకావత్ సవేందర్, తాజుద్దీన్, బాంద్రపు సమ్మయ్య, అక్కినేని సమ్మయ్య, పావిరాల ఓదెలు, కటకం శ్రీనివాస్, మారేపాక శ్రీనివాస్, శంకర్రావు, నరేష్, తిరుపతి, లచ్చన్న, మల్లేష్, కమలోద్దీన్, ముకుందం, రవి, రాజిరెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -