Friday, November 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తాడిచెర్లలో ఘనంగా పూలే వర్థంతి వేడుకలు..

తాడిచెర్లలో ఘనంగా పూలే వర్థంతి వేడుకలు..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలో బిసి సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి , పూలమాలలతో నివాళులర్పించినట్టుగా జాతీయ బీసీ సంఘం జిల్లా నాయకుడు జక్కం రాజేందర్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలేన్నారు. పేదల అభివృద్ధికి గురించి ఎన్నో ఉద్యమాలు చేస్తూ,అగ్ర కులస్తులను ఎదిరించి మహారాష్ట్రలో ఒక ఉద్యమం చేశారన్నారు.ఆయన స్ఫూర్తితో బీసీ,ఎస్సీ,ఎస్టీ బలహీన వర్గాలు ఆశయ సాధనకు కృషి  చేస్తూ,ఆయన  ఆశయాలు కొనసాగించాలన్నారు.త్వరలో అందరి  సహకారంతో తాడిచెర్లలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు చల్ల కుమారస్వామి,కావేటి సమ్మయ్య,దుబ్బంగి మొండయ్య,చల్ల మురళి,మెట్టు అజయ్,ఆకుల వేణు,దశరథి అరవింద్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -