నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రం లో మున్సిపల్ కార్యాలయం వద్ద బహుజన లెప్ట్ పార్టీ (బిఎల్ పి), బహుజన లెప్ట్ ఫ్రంట్ (బిఎల్ ఎఫ్), బిసి సంఘాల ఆద్వర్యంలో మహాత్మ జ్యోతి రావు పూలే 135,వ వర్దంతి సందర్భంగా ఆయన విగ్రహం కు పూల దండ వేసి ఘనంగా నివాళులు ఆర్పించారు. అనంతరం బిఎల్ పి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బిఎల్ ఎఫ్ రాష్ట్ర నాయకులు, సిరిగాద సిద్దిరాములు, బిసి సంఘాల పేడ రేషన్ నాయకులు వడ్ల సాయి కృష్ణ, బిసి సంఘాల నాయకులు, సాప శివరాములు,నాగరాజు, లక్ష్మణ్ తదితరులు మాట్లాడుతు ఆధునిక భారత సామాజిక విప్లవ నిర్మాత మహాత్మా జ్యోతిబా పూలే అందుకో కోట్లాదిమంది బహుజన శ్రామిక ప్రజల స్వయంగౌరవ పోరాట జేజేలు అని పేర్కొన్నారు. నేడు మహాత్మా జ్యోతి బా పూలే వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులు అర్పిద్ధాం, జైభీం లాల్ సలాంలతో ఆ మహనీయునికి ఘనమైన నివాళి అర్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం లో బిఎల్ ఎఫ్ నాయకులు, గంగమణీ, గంగాధర్ తదితరులు ఉన్నారు.
జ్యోతిరావు పూలేకు బీసీ సంఘాల నాయకుల ఘన నివాళులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



