Friday, November 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జిల్లా స్థాయికి ఖోఖో పోటీలకు కమ్మర్ పల్లి  విద్యార్థులు

జిల్లా స్థాయికి ఖోఖో పోటీలకు కమ్మర్ పల్లి  విద్యార్థులు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులు జిల్లా స్థాయికి ఖోఖో లో పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ వేముల నాగభూషణం శుక్రవారం తెలిపారు. కమ్మర్ పల్లి మండల జోనల్ స్థాయి అండర్-14  బాల బాలికల ఖోఖో సెలక్షన్ పోటీలు ఏర్గట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ సెలెక్షన్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కమ్మర్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు కైఫ్, ఆశ్రిత్, కార్తిక్, విద్యాతేజ, షార్వీణి, సహస్ర, మయూరి  జిల్లాస్థాయికి ఎంపికైనట్లు తెలిపారు. జోనల్ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు జిల్లా స్థాయిలో పాల్గొంటారన్నారు. అక్కడ ఉత్తమ ప్రతిభ కనబరిస్తే రాష్ట్రస్థాయిలో అవకాశం లభిస్తుందని ఫిజికల్ డైరెక్టర్ నాగభూషణం తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -