నవతెలంగాణ – సారంగాపూర్
మండలంలోని చించోలి (బి) ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు మాదక ద్రవ్యాల (డ్రగ్స్) వినియోగం, వాటి దుష్ప్రభావాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా, గెస్ట్ స్పీకర్ గా విచ్చేసిన ప్రముఖ ఇంపాక్ట్ ట్రైనర్ “తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో” సభ్యులు కొట్టూరి శ్రీకాంత్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. డ్రగ్స్ అంటే ఏమిటి? అవి సమాజంలో ఎలా సరఫరా అవుతున్నాయి? వాటి బారిన పడితే శారీరకంగా, మానసికంగా ఎలాంటి అనర్ధాలు జరుగుతాయి? అనే విషయాలను విద్యార్థులకు సోదాహరణంగా వివరించారు. యువత మత్తుకు బానిసలైతే కుటుంబాలు, సమాజం ఎలా దెబ్బతింటుందో వివరిస్తూ, వాటిని అరికట్టే మార్గాలను తెలియజేశారు. అనంతరం విద్యార్థుల చేత మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అడ్లూరి మునిందర్ రాజు, పాఠశాల ఉపాధ్యాయులు సునీత, అన్నపూర్ణ, మహేశ్వర్, రవిరాజు, విద్యార్థులు పాల్గొన్నారు.
మాదక ద్రవ్యాల వినియోగం, వాటి దుష్ప్రభావాలపై అవగాహన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


