నవతెలంగాణ-కమ్మర్ పల్లి
బాల్కొండ నియోజకవర్గంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రాంగి మండలం మానాలా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుర్ర శంకర్ గౌడ్ బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో మానాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్యాక్స్ డైరెక్టర్ బుర్ర శంకర్ గౌడ్ బిఆర్ఎస్ పార్టీలో చేరారు. శంకర్ గౌడ్ కు కండువా కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సాధారంగా ఆహ్వానించారు.అందరిని సమన్వయము చేసుకుంటూ మానాలా గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ పటిష్టతకు కృషి చేయాలనీ ఈ సందర్భంగా నాయకులకు ఎమ్మెల్యే సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపిపిలు పీసరి భూమన్న, రాజారామ్, జుల భూమన్న, బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ శాఖ అధ్యక్షులు నాయిని రాజేశం, ఉపాధ్యక్షుడు గంగ నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బీఆర్ఎస్ లో చేరిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


