Friday, November 28, 2025
E-PAPER
Homeజిల్లాలుఅట్టడుగు వర్గాల ఆశాజ్యోతి జ్యోతిబాపూలే

అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి జ్యోతిబాపూలే

- Advertisement -

సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు 
నవతెలంగాణ – వనపర్తి 

అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి జ్యోతిబాపూలే అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు అన్నారు. సీపీఐ(ఎం) వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అమరజీవి, అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి జ్యోతిబాపూలే 135వ వర్ధంతి సీపీఐ(ఎం) కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం డి. జబ్బార్ పాల్గొని ప్రసంగించారు. జ్యోతిబాపూలే 1827 ఏప్రిల్ 11న జన్మించారని, 1890 నవంబర్ 28న మరణించారని అన్నారు.

ఆయన 1848 లోనే మహిళలకు విద్యా నిషేధమైన కాలంలో జ్యోతిబాపూలే అతని భార్య సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పి భారతదేశం లోనే మొట్టమొదటి చదువుల తల్లిగా ఆమెకు చదువు నేర్పారన్నారు. ఆ కాలంలో ఆమె చదువు చెప్పడానికి వెళ్తుంటే బ్రాహ్మణులు పేడ చల్లడం ఆమెపై అనేక రకాలుగా హింసించారన్నారు. అయినా అన్నింటిని తట్టుకొని చదువు నేర్పారని, చివరికి జ్యోతిబాపూలే తండ్రికి కుమారున్ని ఇంట్లో ఉoచ్చుకోవద్దని ఒత్తిడి చేసి కుమారుని, కోడల్ని ఉండకుండా బయటికి పంపేలా ప్రయత్నం చేశారన్నారు. అయినా అదరక బెదరక జ్యోతిబాపూలే అనేక పాఠశాలలను ప్రారంభించి మహిళలకు చదువు నేర్పించిన వ్యక్తి అని అన్నారు.

అట్టడుగు వర్గాల ఆశ జ్యోతిగా జ్యోతిబాపూలే నిలిచారని, అందుకే అంబేద్కర్ అంతటి మహా మేధావికే గురు స్థానంలో నిలువగలిగాడని అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా అందరికీ చదువుకునే హక్కును ప్రసాదించటం పూలే ఆచరణకు కొనసాగింపుగానే చూడాలన్నారు. జ్యోతిబాపూలే తదనంతర కాలంలో అంబేద్కర్ రూపంలో చాలా సమర్థవంతంగా కొనసాగిందన్నారు. ఆస్పూర్తి ఆనాటిదే కాదని, ఈనాటికీ కొనసాగుతూనే ఉందని, ఉంటుందని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. రాజు, జిల్లా కమిటీ సభ్యులు పరమేశ్వర చారి, సీపీఐ(ఎం) నాయకులు ఉమా, నిక్సన్, బాలరాజు గౌడు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -