నవతెలంగాణ – నస్రుల్లాబాద్
విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు దరిచేరవని నసురుల్లాబాద్ మండల విద్యాధికారి చందర్ తెలిపారు. శుక్రవారం మండలంలోని దుర్కి ప్రభుత్వ పాఠశాలలో బాన్సువాడ నాలుగో సంవత్సరం కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల రిజిస్ట్రేషన్, వైటల్ సైన్స్, ఎత్తు-బరువు కొలత, పోషకాహార లోపాలు, ముక్కు గొంతు, చెవి, కంటి పరీక్ష, జీర్ణాశయ పరీక్ష, ప్రవర్తన లోపాల పై పరీక్షలు నిర్వహించారు. అలాగే పుచ్చు పన్ను నివారణ, చేతుల పరిశుభ్రత, ప్రమాదాల నివారణ, విటమిన్ల ప్రాముఖ్యత, పర్యావరణ పరిశుభ్రత వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంఈఓ చంద్ర మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తన వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని. తినుబండారాలు తినకుండా జాగ్రత్త పడాలన్నారు. ప్రిన్సిపాల్ యని ప్రణుతి, వైస్ ప్రిన్సిపాల్ మెర్సీ హెచ్ ఓ డి పద్మ , క్లాస్ కోఆర్డినేటర్ శాంతి జయసుధ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి: ఎంఈఓ చందర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


