Friday, November 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లారీల కొరతతో కల్లాల్లోనే వరిధాన్యం 

లారీల కొరతతో కల్లాల్లోనే వరిధాన్యం 

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి 
మండలంలో ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న వరి ధాన్యం, తూకం నిర్వహించిన వారం రోజులు పూర్తవుతున్న వరి ధాన్యాన్ని తరలించకపోవడంతో రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని మద్దికుంట, పాల్వంచ మండలం సింగరాయపాలీతోపాటు పలు గ్రామాల్లో తూకం వేసిన వారం రోజుల నుండి లారీలు రాకపోవడంతో తూకం వేయడం బందు చేశారు. ప్రభుత్వం పూర్తిస్థాయిలో రైస్ మిల్లకు అలాట్మెంట్ ఇవ్వకపోవడంతో, ఇచ్చిన రైస్ మిల్లకు టార్గెట్ పూర్తి కావడంతో లారీల నుండి వరి ధాన్యం అన్లోడ్ కాకపోవడంతో, వరి ధాన్యం తరలించడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. తూకం వేసిన తర్వాత , తూకంలో తేడా వస్తే బాధ్యులు ఎవరని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఘటనపై సంబంధిత అధికారి జితేందర్ ను వివరణ కోరగా, రైస్ మిల్లకు అలాట్మెంట్ లేక లారీలు నిలిచిపోయాయని, రేపటిలోగా సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -