Friday, November 28, 2025
E-PAPER
Homeఖమ్మంతానా బాలసాహిత్య భేరికి అశ్వారావుపేట విద్యార్ధిని ఎంపిక 

తానా బాలసాహిత్య భేరికి అశ్వారావుపేట విద్యార్ధిని ఎంపిక 

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రపంచ సాహిత్య వేదిక ప్రతిష్టాత్మకంగా బాలసాహిత్య భేరి పేరుతో నిర్వహిస్తున్న అంతర్జాతీయ బాల సాహిత్య సమ్మేళనానికి  అశ్వారావుపేట జిల్లాపరిషత్ బాలురోన్నత పాఠశాలలో కు చెందిన 9 వ తరగతి కి కంభంపాటి శృతి ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయురాలు పరుచూరి హరిత శుక్రవారం తెలిపారు. ఈ సమ్మేళనంలో కథ,వచన కవిత్వం, గేయ,పద్య విభాగాల్లో ప్రపంచవ్యాప్తంగా 101 మంది తెలుగు విద్యార్ధులు పాల్గొన నుండగా శ్రుతి కి గేయ విభాగంలో 3 నిమిషాలపాటు తన వాణిని వినిపించే అవకాశం లభించింది. సి.ఆర్.పి ప్రభాకరాచార్యులు నేతృత్వంలో, భాషోపాధ్యాయురాలు రమాదేవి పర్యవేక్షణలో ఈ నెల 30 వ తేదీ న అంతర్జాలం లో జరిగే సమ్మేళనంలో ప్రపంచవ్యాప్తంగా కంభంపాటి శృతి తన గేయాన్ని వినిపించనుంది. తమ విద్యార్ధికి ఈ అవకాశం కల్పించినందుకు తానా అధ్యక్షులు నరేన్ కొడాలి, నిర్వాహకులు తోటకూర ప్రసాద్,సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్ లకు సి.ఆర్.పి ప్రభాకరాచార్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా  శృతిని ప్రధానోపాధ్యాయురాలు హరిత పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -