- Advertisement -
నవతెలంగాణ – పెద్దకొడప్ గాల్
ఎన్నికల నేపథ్యంలో మండల పరిధిలో పోలీసులు ముమ్మరంగా వాహనాలను తనిఖీలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ఎలాంటి సరైన ఆధారాలు లేకుండా అధిక మొత్తంలో నగదు, లేదా మద్యం రవాణా చేస్తూ దొరికితే, సంబంధిత డబ్బులు లేదా మద్యం తక్షణమే సీజ్ చేయబడుతాయి అని తెలిపారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ తనిఖీలలో ఇంచార్జీ ఆఫీసర్ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



