– బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి బొడ్డు నర్సింలు యాదవ్.
నవతెలంగాణ – తొగుట
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి బొడ్డు నర్సిం లు యాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే చిత్ర పఠానికి పూల మాల వేసి ఘనంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహిం చారు. మహాత్ముని విగ్రహానికి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ ముంగట భూమి పూజ చేశారు. ఈ సంద ర్బంగా మాట్లాడుతూ గత నెలలో కాంగ్రెస్ ప్రభు త్వం బీసీలకు గాను స్థానిక సంస్థలలో42 శాతం ఇవ్వడానికి జీవో ఇవ్వడం జరిగిందన్నారు. దాని ప్రకారం రిజర్వేషన్లు ప్రకటించి నోటిఫికేషన్ జారీ చేశారాని ఓర్వలేని ఉన్నత వర్గాలు, అన్ని పార్టీల అగ్ర కులాలకు చెందిన నాయకులు కోర్టుకు వెళ్లి నోటిఫికేషన్ నిలిపి వేశారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పాత రిజర్వేషన్ ప్రకారం 22 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి నోటిఫి కేషన్ అగ్ర వర్ణాలకు లోబడి రొటేషన్ పద్ధతి కాకుం డా ఇష్టారాజ్యంగా రిజర్వేషన్లు ప్రకటించారని మండి పడ్డారు.
వెంటనే ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేసి గతంలో ప్రకటించిన ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే ఎన్నికలకు వెళ్లా లని డిమాండ్. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉద్రిక్తం చేసి ప్రభుత్వం మెడలు వంచి రిజర్వేషన్ సాధించి తీరుతామని హేచ్చరించారు. 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని తహసిల్దార్, ఎంపీడీవో లకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి కంకణాల నర్సింలు, వేల్పుల స్వామి, అక్కార సత్తయ్య, సిరిగోని గోవర్ధన్, సుతారి రమేష్, కురుమ, యాదగిరి, కుంభాల శ్రీనివాస్, కడారి నరేందర్, కొంగరి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.



