Friday, November 28, 2025
E-PAPER
Homeజిల్లాలునవంబర్ 30న జడ్చర్లలో అందెశ్రీ సంస్మరణ సభ  

నవంబర్ 30న జడ్చర్లలో అందెశ్రీ సంస్మరణ సభ  

- Advertisement -

యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు నర్సింలు 
నవతెలంగాణ – మిడ్జిల్

నవంబర్ 30న జడ్చర్ల పట్టణంలోని ప్రభుత్వ బిఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో అందెశ్రీ సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్. నర్సింలు, మండల అధ్యక్షులు వెంకటయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అందెశ్రీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకమైన పాత్ర పోషించారని చెప్పారు. అనగారిన వర్గాల ప్రజల పక్షాన తన పాటల రూపంలో ఎంతో మందిని చైతన్యం చేశారని అన్నారు.ఆయన అకాల మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ఈ తరుణంలో తెలంగాణ ప్రత్యేక రాష్ర్టానికి ఆయన చేసిన సేవలను, ఆయన కలం నుంచి జాలువారిన తెలంగాణ యాస రచనలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో జడ్చర్ల మండల కేంద్రంలో అందెశ్రీ సంస్మరణ సభను నిర్వహించ తలపెట్టామని తెలిపారు. ఈ సభను జడ్చర్ల నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి మేధావులు, యువకులు, ప్రజాసంఘాల నాయకులు, భారీ ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సామాజిక ఉద్యమకారులు నందిని సిద్ధారెడ్డి, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి లు వస్తున్నట్టు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -