– సత్తా చాటిన బాలికోన్నత పాఠశాల విద్యార్ధులు
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఈఎల్టీఏ(ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్,) ఆధ్వర్యంలో మండల స్థాయిలో శుక్రవారం జరిగిన ఒలింపియాడ్ – ఎడ్యుక్వెస్ట్ పోటీలలో అశ్వారోవుపేట బాలికోన్నత పాఠశాల విద్యార్ధిని లు తమ సత్తా చాటారు. మండలంలోని ఆరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్ధులు పాల్గొన్న ఈ పోటీల్లో బాలికోన్నత పాఠశాల విద్యార్ధినులు సీనియర్ విభాగం( ఇంగ్లీష్ ఒలింపియాడ్ ) లో 9 వ తరగతి విద్యార్ధిని ఎస్కే జాస్మీన్,జూనియర్స్ విభాగంలో 8 వ తరగతి విద్యార్ధిని జాహ్నవి సీతాకుమారి ఎడ్యుకెస్ట్ సీనియర్ విభాగంలో 9 వ తరగతి విద్యార్ధిని కే.సుమన శ్రీ,జూనియర్స్ విభాగంలో 7 వ తరగతి విద్యార్ధిని టీ.నీలిమ లు ప్రధమ బహుమతులు సాధించి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ విద్యార్ధులను ప్రోత్సహించి, మంచి ఫలితాలు రావడానికి కృషి చేసిన ఆంగ్ల ఉపాధ్యాయురాలు నర్మద ను ప్రధానోపాధ్యాయులు నల్లపు కొండల రావు అభినందించారు.
మండల స్థాయి ఒలింపియాడ్, ఎడ్యుకెస్ట్ లో విద్యార్థినిల ప్రతిభ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



