నవతెలంగాణ-మర్రిగూడ
గ్రామపంచాయితీ సాధారణ ఎన్నికలలో భాగంగా మండల వ్యాప్తంగా మొదటి విడుతలో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి సరంపేట,శివన్నగూడ,మర్రిగూడ నామినేషన్ సెంటర్ల ను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. సెంటర్లలో ఉన్న రికార్డులను పరిశీలించి నామినేషన్ ప్రక్రియ గురించి అక్కడ ఉన్న అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. అనంతరం మండల కేంద్రంలో ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల,ఆదర్శ పాఠశాలను సందర్శించి అక్కడ ఉన్న మౌలిక వసతులను తెలుసుకున్నారు. భోజనం మెనూ ఏ విధంగా ఉన్నదని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. భోజనం విషయంలో మెనూను తప్పనిసరిగా పాటించాలని యాజమాన్యాలకు సూచించారు. కస్తూరిబా పాఠశాలలో విద్యార్థులకు ఉన్న వస్తువుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. లాంగ్ లీవ్ లో ఉన్న విద్యార్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలని,లాంగ్ లీవ్ గల కారణాలను తల్లిదండ్రుల నుండి పూర్తి వివరాలు తీసుకోవాలన్నారు. కాసేపు తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించి విద్యార్థులకు పాఠాలు బోధించారు.క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. ఆమె వెంట చండూరు ఆర్ డి ఓ శ్రీదేవి, తాహసిల్దార్ జక్కర్తి శ్రీనివాసులు,ఎంపీడీవో జిసి మున్నయ్య,ఎంపీ ఓ రవికుమార్ ఉన్నారు.
నామినేషన్ సెంటర్స్ ను సందర్శించిన కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



