Friday, November 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్వాడిల్లో చిన్నారుల సంఖ్యను పెంచాలి..

అంగన్వాడిల్లో చిన్నారుల సంఖ్యను పెంచాలి..

- Advertisement -

జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి మల్లీశ్వరి ఐసిడిఎస్.. సిడిపిఓ రాధిక
నవతెలంగాణ – మల్హర్ రావు

అంగన్వాడిల్లో చిన్నారుల సంఖ్యను పెంచాలని శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి మల్లీశ్వరి, ఐసిడిఎస్ మహాదేవపూర్ ప్రాజెక్టు సిడిపిఓ రాధిక, టిడబ్ల్యూ మల్లీశ్వరి అంగన్ వాడి టీచర్లను ఆదేశించారు. శుక్రవారం ఐసిడిఎస్ మండల సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి అధ్యక్షతన వళ్లెంకుంట సెక్టార్ సమీక్ష సమావేశాన్ని కొయ్యుర్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారం అర్హులైన చిన్నారులకు, బాలింతలకు, గర్భిణీలకు సకాలంలో అందించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం బాలికల రక్షణ, విద్య కోసం ప్రారంభించిన భేటి బచావో-భేటి పడాఓ పతకంపై అవగాహన నిర్వహించారు. బాల్య వివాహాలు,మొబైల్ ఫోన్లతో కలిగే నష్టాలు, లైంగిక వేధింపులపై అవగాన కల్పించారు. 18 సంవత్సరాల లోపు పిల్లలు ఆపదలో ఉన్నప్పుడు 1098 టోల్ ప్రి నెంబర్ ను సంప్రదించాలన్నారు. స్ర్తి,పురుషులు సమానత్వం లింగ నిర్దారణ చట్టరీత్య నెరమన్నారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ పరిధిలోని అంగన్ వాడి టీచర్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -