సామాన్య కార్యకర్తకు దక్కిన గౌరవం : ఏలే మల్లికార్జున్
కామారెడ్డి జిల్లాని కాంగ్రెస్ కంచుకోటగా మారుస్తాం : ఏలే
జుక్కల్ బిడ్డకి దక్కిన గుర్తింపు : జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంత రావు
కష్టపడ్డ కార్యకర్తలకి అన్ని పదవుల్లో సముచిత స్థానం : జుక్కల్ ఎమ్మెల్యే
నవతెలంగాణ – జుక్కల్
కాంగ్రెస్ అధిష్టానం ఇటీవల నియమించిన కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ కి భారీ స్వాగతం పలికి అత్యంత ఘన సన్మానం చేసిన జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంత రావ్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఏలే మల్లికార్జున్ అభిమానులు నర్సింగ్ రావ్ పల్లి క్రాస్ రోడ్ నుండి పిట్లం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సంధర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన సభ లో పెద్ద ఎత్తున జుక్కల్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావ్ గారు మాట్లాడుతూ, ” ఏలే మల్లికార్జున్ నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్త. జిల్లా పార్టీ యంత్రాంగాన్ని నడిపించే సత్తా ఉన్న నాయకుడు అని కొనియాడారు. అంతే కాకుండా, కష్టపడ్డ కార్యకర్తలకి పార్టీ పదవుల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో మరియు నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తా అని తెలిపారు”. జుక్కల్ నియోజకవర్గ ముద్దు బిడ్డ, నిజాం సాగర్ కి చెందిన ఏలే మల్లికార్జున్ కి డి.సి.సి పదవి రావడం మన జుక్కల్ కే గర్వ కారణం అని తెలిపారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో జుక్కల్ లో అన్ని స్థానాలని గెలిపించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానుక గా ఇవ్వాలని కోరుతున్నాను.
ఈ కార్యక్రమం లో కామారెడ్డి డి.సి.సి అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ ” నేను డి.సి.సి అధ్యక్షుడు కావడం, నా లాంటి సామాన్య కార్యకర్తలకి లభించిన గౌరవం మరియు గుర్తింపు, కామారెడ్డి జిల్లాలో పార్టీ బలోపేతం పై దృష్టి సారిస్తా, కామారెడ్డి ని కాంగ్రెస్ కంచు కోట గా మారుస్తా, కార్యకర్తల మనోభావాలకి అనుగుణంగా నడుచుకుంటా” అని తెలిపారు. అధే విధంగా, కాంగ్రెస్ పార్టీ తోనే సామాజిక న్యాయం దక్కుతుంది, స్థానిక ఎన్నికల్లో అందరి లీడర్లతో సమన్వయం చేసుకుంటూ కాంగ్రెస్ జెండా రెపరెప లాడిస్తామని తెలిపారు.
నా పై నమ్మకం ఉంచి, డి.సి.సి అధ్యక్షుడిగా నియమించినందుకు, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధి, రేవంత్ రెడ్డి, పి.సి.సి. అధ్యక్షులు మహేష్ గౌడ్, మీనాక్షి నటరాజన్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతా రావ్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకి మరియు ప్రతి ఒక్కరికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న అని ఏలే మల్లికార్జున్ తెలిపారు. ఈ సన్మాన సభ లో జుక్కల్ నియోజకవర్గం లోని అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు మరియు కాంగ్రెస్ శ్రేణులు పాల్గొని విజయవంతం చేశారు.



