నవతెలంగాణ – సదాశివ నగర్
మండలంలోని పద్మాజీ వాడి చౌరస్తా నుండి బాన్సువాడకు వెళ్లే రహదారిపై ప్యాచ్ వర్క్ ను తూతూ మంత్రంగా వేశారు. దీంతో మూన్నాళ్లకే ప్యాచ్ వర్క్ చెదిరిపోయి రోడ్డు యధావిధిగా గుంతలమయమైంది. ఈ రోడ్డును కాంట్రాక్టర్లు వేసిన తీరుకు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్యాచ్ వర్క్ వల్ల రోడ్డుకు ఒరిగింది ఏం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం ప్యాచ్ వర్క్ కాకుండా పూర్తిగా రోడ్డుపైన తార్ వేసి బాగు చేయాలని కోరుతున్నారు. రాత్రివేళల్లో ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే జంకుతున్నారు. ఎక్కడ ఏ గుంతలో ద్విచక్ర వాహనదారులు పడిపోతారో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి రోడ్డు పనులు నాణ్యతతో పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
మున్నాళ్లకే ఎగిరిపోయిన రోడ్డు ప్యాచ్ వర్క్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


