- Advertisement -
ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్
కోల్‌కతా : సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో హైదరాబాద్ తొలి ఓటమి చవిచూసింది. శుక్రవారం జాదవ్‌పూర్ యూనివర్శిటీ గ్రౌండ్‌లో జరిగిన ఎలైట్ గ్రూప్-బి మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై మహారాష్ట్ర గెలుపొందింది. చామ మిలింద్ (35 నాటౌట్), తనరు త్యాగరాజన్ (32), రాహుల్ బుద్ది (31) రాణించటంతో తొలుత హైదరాబాద్ 20 ఓవర్లలో 191/8 పరుగులు చేసింది. ఛేదనలో ఓపెనర్లు పృథ్వీ షా (66, 36 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు), అర్షిన్ కులకర్ణి (89 నాటౌట్, 54 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగటంతో 18.4 ఓవర్లలోనే మహారాష్ట్ర 192/2తో లాంఛనం ముగించింది. హైదరాబాత్ తర్వాతి మ్యాచ్‌లో గోవాతో ఆడనుంది.
- Advertisement -



