Saturday, November 29, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిపాలస్తీనా-సంఘీభావం

పాలస్తీనా-సంఘీభావం

- Advertisement -

1947 నవంబర్‌ 29న ఐక్యరాజ్యసమితి చేసిన పాలస్తీనా విభజనపై తీర్మానం ఆమోదించిన సందర్భానికి గుర్తుగా ప్రతియేటా నవంబర్‌ 29ని ప్రపంచ దేశాలు ”పాలస్తీనా ప్రజల పట్ల అంతర్జాతీయ సంఘీభావ దినోత్సవం” పాటించాలని 1978లో సూచించింది. పాలస్తీనా భూభాగంపై చట్టవిరుద్ధమైన ఆక్రమణలను ముగించాలని కోరడంతో పాటు పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా నిలవాలని కోరడమైంది. గత ఏడు దశాబ్దాలుగా పలు ప్రయత్నాలు జరిగినప్పటికీ మధ్యప్రాచ్యంలో శాశ్వత శాంతి అస్పష్టంగానే ఉన్నదని, తక్షణ పరిష్కారం జరగాలని ప్రపంచ మానవాళి కోరుకుంటున్నది. పాలస్తీనియన్ల హక్కుల కోసం పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఇజ్రాయిల్‌ దాడులతో గాజాలో నేడు మానవతా సంక్షోభం ఏర్పడింది. 1947లో పాలస్తీనాను యూదు, అరబ్‌ దేశాలుగా విభజించాలని ఐరాస ప్రతిపాదించింది. పాలస్తీనా స్వయం నిర్ణయాధికారం, హక్కుల పరిరక్షణ, న్యాయం, గౌరవం కోసం పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. 2023 అక్టోబర్‌ 7న హమాస్‌ దాడులతో ప్రారంభమైన ఇజ్రాయిల్‌- పాలస్తీనా యుద్ధం నేడు తీవ్రరూపం దాల్చి గాజాను నేలమట్టం చేయడం, ప్రజలు దీనంగా ప్రాణాలను అరచేతుల్లా పెట్టుకొని వలసలు వెళ్లడం జరుగుతోంది.

ఈ యుద్ధంలో దాదాపు ఎనభై శాతం పాలస్తీనియన్‌ పౌరులు (మహిళలు, పిల్లలతో సహా) మరణించి ఉంటారని అంచనా వేస్తున్నారు. గత ఇరవైఐదు మాసాలుగా జరుగుతున్న దాడులతో 72వేలకు పైగా (70,525 పాలస్తీనా పౌరులు, 2,109 ఇజ్రాయిల్‌ పౌరులు) ప్రజలు ప్రాణాలు కోల్పోవడం జరిగినట్లు స్పష్టమవుతోంది. చనిపోయిన అభాగ్యుల్లో దాదాపు 33 శాతం మంది 18 ఏళ్ల లోపు వారే ఉండడం విచారకరం. దీనికి తోడుగా దాదాపు 2.3 మిలియన్ల వలసలు కూడా జరిగినట్లు తెలుస్తున్నది. వలసదారుల ఆకలికేకలు వినే నాధుడే కరువైన దుస్థితి ఏర్పడింది. ఇజ్రాయిల్‌ బాంబు దాడులకు గాజా గజగజ వణుకుతోంది. శాశ్వత యుద్ధ విరమణ చర్యలు ముందుకు సాగడం లేదు. 2025 తొలి రోజుల్లో 32వేలమంది పాలస్తీనా ప్రజలను ఇజ్రాయిల్‌ వెస్ట్‌ బ్యాంక్‌ ప్రాంతంలో ఇంట్లోంచి గెంటేసి తిరిగి రాకుండా అడ్డుకట్ట వేయడం చూసి ప్రపంచం నివ్వెరపోయింది. ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహూ దాహానికి సమాధానం లేదు.

ఇజ్రాయిల్‌ బాంబులకు విశ్రాంతి లేదు. పాలస్తీనా ప్రజలకు కంటి మీద కునుకు లేదు. గాజాలో నేలమట్టం కాని భవనాలు లేవు. వలసదారులకు ఆకలి తీర్చే హస్తాలు లేవు. మానవ హక్కుల పరిరక్షణ చర్యలు అసలే లేవు. ఇజ్రాయిల్‌ రక్త దాహం తీరడంలేదు. ప్రాణాలంటే లెక్కలేదు. మానవత్వం మరణిం చింది. రాక్షస దాడులు ఆగడం లేదు. పాలస్తీనా నామరూపాలు లేకుండా పోయింది. శరణార్థులకు చేయూత నిచ్చిన చేతులను సహితం తెగకోసే దారుణాలు జరుగుతు న్నాయి. ప్రాణాలున్న పాలస్తీనా ప్రజలు పలుచబడ్డారు. శవాల కుప్పలను చూసి బాధ పడని వారు లేరు. ట్రంప్‌మధ్యవర్తిత్వ మాటలకు అర్థాలు వేరుగా కనిపిస్తున్నాయి. కాల్పుల విరమణ వాగ్దానాలు క్షణాల్లో ఆవిరవు తున్నది. అదుకే నేడు మానవాళి సంఘీభావ శక్తి ఇజ్రాయిల్‌ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలి. ఐరాస తన సత్తా చాటాలి. శాశ్వతశాంతి స్థాపనకు అగ్రరాజ్యాలు కూడా నడుం బిగించాలి.
(నేడు ‘పాలస్తీనా అంతర్జాతీయ సంఘీభావ దినోత్సవం’)

  • బుర్ర మధుసూదన్‌ రెడ్డి, 9949700037
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -