Saturday, November 29, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఆమె సేవలు అనేకులకు ఆశాజనకం

ఆమె సేవలు అనేకులకు ఆశాజనకం

- Advertisement -

పాల్వంచ కేజీబీవీ ఎస్‌ఓ మొవ్వతులసికి పాఠశాల విద్యాశాఖ ప్రశంసలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేజీబీవీ స్పెషల్‌ ఆఫీసర్‌ మొవ్వ తులసి పాఠశాల విద్యాశాఖ నుంచి ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారు. అణగారిన వర్గాల బాలికల సాధికారత కోసం ఆమె దశాబ్ద కాలంగా అంకితభావంతో సేవలందించారు. ఆ జిల్లాలోనే అత్యధిక మంది విద్యార్థులతో ఆదర్శంగా పాల్వంచ కేజీబీవీని ఆమె నిలిపారు. బడి మధ్యలో మానేసిన వారిని గుర్తించి, పర్యవేక్షించి, తిరిగి పాఠశాల వైపు ఆమె ఆకర్షించారు. వారి పట్ల ఆమెకున్న అంకితభావానికి ఇది నిదర్శనంగా నిలిచింది. పాల్వంచ కేజీబీవీలో ఎక్కువ మంది విద్యార్థులు అనాథలు, తల్లి లేదా తండ్రిని కోల్పోయినవారు, లేదా రక్షించబడి భద్రత, సఖి కేంద్రాల్లో పునరావాసం పొందుతున్న వారే ఉన్నారు. తులసి ఆమెకు అప్పగించిన బాధ్యతలకు మించి చిన్నారుల్లో ఒక తల్లిలాగా ఉత్సాహాన్ని నింపారు. విద్యార్థుల భావోద్వేగాలకు గురి కాకుండా, విద్యాపరమైన గైడెన్స్‌ ఇస్తూ, వ్యక్తిగతంగా వారికి మద్దతుగా నిలబడిన ఆమె పాఠశాలను బాలికలు భద్రమైన, విలువలు కలిగిన, భవిష్యత్తుపై ఆశలు కలిగించే చోటుగా భావించే పరిస్థితిని తెచ్చారు. సదరు కేజీబీవీలో 6వ తరగతిలో చేరిన ఎన్‌.భార్గవి ఉన్నత విద్య కోసం నిధులు సమకూర్చి సహకరించి జీవితాన్ని మార్చింది. ఆమె సహకారంతో మారిన విద్యార్థుల్లో ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఈ విద్యాలయంలో జీవితంలో గాయపడి, అనేక ప్రతికూలతో చేరిన విద్యార్థులెందరో ఆమె గైడెన్స్‌, ప్రోత్సాహం, కల్పించిన భద్రతో జీవితాలను మార్చుకున్నారు. దాతలు, సంస్థలను, అలుమ్నిలను సమన్వయం చేసి ఉన్నత విద్యకు అవసరమైన నైపుణ్య శిక్షణను ఆ అణగారిన బాలికలకు ఆమె చేరువ చేసింది. దీంతో ఆ బాలికలు సాధికారత ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్తున్నారు.

సమాజ సాధికారిత కోసం ఆమె సేవలు: డాక్టర్‌ ఇ.నవీన్‌ నికోలస్‌
మొవ్వ తులసి అందించిన అసాధారణ సేవలను పాఠశాల విద్యా సంచాలకులు డాక్టర్‌ ఇ.నవీన్‌ నికోలస్‌ కొనియాడారు. హైదరాబాద్‌లోని పాఠశాల విద్య సంచాలకుల కార్యాలయంలో ఆమె ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యావ్యవస్థకు తులసి లాంటి విద్యావంతులే వెన్నుముక లాంటి వారని అభినందించారు. ఆమె దయ, అంకితభావంతో ప్రజాసేవలో ఉన్నత విలువలను నెలకొల్పారని చెప్పారు. ఆమె లాంటి నాయకులతో కేవలం పాఠశాలలు బలోపేతం కావడం కాకుండా సాధికారతతో కూడిన సమాజ నిర్మాణం జరుగుతుందన్నారు. ఆమె అనేక మంది బాలికలకు జీవితాల్లో చిరునవ్వులు, ఆశను అందించారని ప్రశంసించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -