Saturday, November 29, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంభవిష్యత్‌ ప్రగతికి విద్యే మార్గం

భవిష్యత్‌ ప్రగతికి విద్యే మార్గం

- Advertisement -

– తెలంగాణ విజన్‌ డాక్యుమెంట్‌లో బీసీల అభివృద్ధిపై ప్రత్యేక ఎజెండా : మంత్రి పొన్నం ప్రభాకర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

భవిష్యత్‌ ప్రగతికి విద్యే మార్గమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. తమ శాఖలో దానికి తగు ప్రాధాన్యతనిస్తున్నా మని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదా యంలో బీసీ సంక్షేమ శాఖ ఉన్నతా ధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహిం చారు. రాష్ట్రాభివృద్ధిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్‌-2047 పాలసీని రూపొందించబోతున్నా మని చెప్పారు. రాష్ట్రంలో అత్యధి కంగా ఉన్న బీసీల అభివృద్ధిపై అందులో ప్రత్యేక ఎజెండాగా చర్చించ బోతున్నామని వివరించారు. రాష్ట్ర జనాభాలో వెనుకబడిన తరగతులు 56 శాతంగా ఉన్నాయని చెప్పారు. వారి సామాజిక ఆర్థిక పురోగతి తెలం గాణకు కీలకమైందని గుర్తు చేశారు. బీసీలు విద్యా పరంగా, ఆర్థికంగా స్వతంత్రం గా, సామాజికంగా సాధికారత సాధిం చాలని ఆకాంక్షించారు. ప్రపంచ వ్యాప్తంగా వారు పోటీతత్వాన్ని ఎదు ర్కొనేలా చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు. విద్య అనేది మానవ మూలధనమని పొన్నం చెప్పారు. నిరం తరం నాణ్యమైన అభ్యాసం ద్వారా విద్యా ప్రమా ణాలు బలోపేతం చేస్తామని హామీనిచ్చారు. రెసిడెన్షియల్‌ పాఠశాలలను అత్యుత్తమ కేంద్రాలుగా అభివృద్ధి పరుస్తామన్నారు. ఉన్నత పాఠశాల నుంచే ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్‌ అక్షరాస్యత, వ్యవ స్థాపకతను పరిచయం చేస్తామని తెలిపారు. బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శ్రీధర్‌, గురుకుల సెక్రెటరీ సైదులు, బీసీ సంక్షేమ శాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ అలోక్‌ కుమార్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -