నవతెలంగాణ-యాలాల
మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలను డీపీఓ తరుణ్ కుమార్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కోకట్ గ్రామపంచాయతీలో పనిచేస్తున్న ఎంపీడబ్ల్యూ సిబ్బందిని అభినందించి శాలువాలతో సన్మానించారు. అడాల్ పూర్, అన్నాసాగర్, కోకట్, గ్రామపంచాయతీ కార్యాలయాలను సందర్శించి రికార్డ్స్, పల్లె ప్రగతి, అభివృద్ధి పనుల తనిఖీ చేశారు. కార్యక్రమంలో డీఎల్పీఓ శంకర్, ఎంపీఓ గాలి యాదయ్య, పంచాయతీ కార్యదర్శులు రాజ్ కుమార్, సుధాకర్, ఆంజనేయులు, గోపాల్, తదితరులు పాల్గొన్నారు.