రానున్నది ఇందిరమ్మ రాజ్యమే

– అన్ని వర్గాల ప్రజలకూ కాంగ్రెస్‌తోనే న్యాయం
– డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి
– కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు
నవతెలంగాణ-కుల్కచర్ల
రానున్నది ఇందిరమ్మ రాజ్యమేనని కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాల ప్రజలకూ న్యాయం జరుగుతుందని డీసీసీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ రామ్మోహన్‌ రెడ్డి అన్నా రు. మంగళవారం మండలం అంతారం సర్పంచ్‌ దగ్గుల కృష్ణయ్య, బీఆర్‌ఎస్‌ గ్రామకమిటీ అధ్యక్షుడు శివనందు తన అనుచరులతో కలిసి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ముజాహిద్‌పూర్‌లో బీఆర్‌ఎస్‌ నాయకులు, ఎత్తు కాల్వ తండాలో గిరిజనులు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భం గా డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముజాహిద్‌పూర్‌, అంతారం పు ట్టా పహాడ్‌, బిందెం గడ్డ తండా, రోకలి గుట్ట తండాల్లో ఇంటింటికి తిరిగి 6 గ్యారెంటీ పథకాలపై ప్రజలకు వివ రించారు. అనంతరం మాట్లాడుతూ..కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు చేస్తున్న మోసాన్ని ప్రజలు గుర్తించారని రానున్న ఎన్నికల్లో వారికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. 6 గ్యారెంటీ పథకాలను చూసి గ్రామాల్లోని ప్రజలు స్వ చ్ఛందంగా కాంగ్రెస్‌లో చేరుతున్నారని రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం ఖాయమన్నారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు బోలుసని బీంరెడ్డి, బ్లాక్‌ బి అధ్యక్షుడు కర్రే భరత్‌ కుమార్‌, మండలాధ్యక్షుడు ఆంజనేయులు, జిల్లా నాయకులు కుమ్మరి స్వామి, మహి ళా విభాగం మండలాధ్యక్షురాలు ముజాహిద్‌పూర్‌ సర్పం చ్‌ లక్ష్మి ఆనంద్‌, కాంగ్రెస్‌ మండల ప్రధాన కార్యదర్శి గోపాల్‌ నాయక్‌, మాజీ ఎంపీపీ ఆంజిలయ్యగౌడ్‌, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love