Monday, December 1, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఆటో బోల్తా.. ఇద్దరు మృతి, 15 మందికి గాయాలు

ఆటో బోల్తా.. ఇద్దరు మృతి, 15 మందికి గాయాలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఏపీలోని అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అంగళూరు వద్ద గండిపోచమ్మ ఆలయానికి వెళ్లి వస్తుండగా ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, పాలకొల్లుకు చెందిన 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి నిమ్మల రామ్మోహన్‌ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -