కాంగ్రెస్ తరుపున నామినేషన్ ధాకలు చేసిన గగ్గెనపల్లి సాంభారెడ్డి
నవతెలంగాణ – పెద్దవూర
అందుబాటులో ఉండి గ్రామంలో సమస్యలన్నీ నిజాయితీగా బాధ్యత గా పరిష్కరిస్తాను. గ్రామం లో అందరికి అందుబాటులో వుంటూ గ్రామ సమస్యలు అన్నీ పరిష్కరిస్తామని మండలం లోని చలకుర్తి గ్రామానికి చెందిన గగ్గెనపల్లి సంభా రెడ్డి అన్నారు. జరగబోయే సర్పంచ్ ఎన్నికలలో పోటీ లో ఉండి సోమవారం నామినేషన్ ధాకలు చేషామన్నారు. మీరు మీ ఓటు ద్వారా నన్ను ఆశీర్వదిస్థారని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. మన గ్రామం అభివృద్ధి కోసం నిధులు తీసుకోస్థానని, అవి సక్రమంగా ఖర్చుచేసి బాద్యతగా పని చేస్తానని తెలిపారు. గ్రామ సభలు నిర్వహించి సమస్యలు ప్రజల ద్వారా తెలుసుకొని పరిష్కరిస్థానని చెప్పారు. అణునిత్యం అందుబాటులో ఉండి ఒక సేవకుడిగా పని చేస్తానని కోరారు. ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించి ఓటు వేయండని కోరారు. ఈ కార్యక్రమం హాలియా మార్కెట్ ఛైర్మెన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి,పీసీసీ కార్యదర్శి సైదయ్య బాబు,సల్ల హనుమంత్ రెడ్డి నామీనేషన్ వేసిన వారి వెంట వున్నారు.
నిజాయితీగా పనిచేసి గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



