Monday, December 1, 2025
E-PAPER
Homeఖమ్మంమదురై లో పర్యటిస్తున్న వ్యవసాయ విద్యార్ధులు

మదురై లో పర్యటిస్తున్న వ్యవసాయ విద్యార్ధులు

- Advertisement -

– ఎంఏబీఐఎఫ్ సందర్శన 
నవతెలంగాణ – అశ్వారావుపేట

ప్రొఫెసర్ జయశంకర్ విశ్వ విద్యాలయం పరిధిలోని అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల 2023 బ్యాచ్,మూడో సంవత్సరం వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్న 102 మంది విద్యార్థులు ఈ నెల 23 వ తేదీ నుండి డిసెంబర్ 3 వ తేదీ వరకు పదిరోజులు పాటు చేపట్టిన దక్షిణభారత విజ్ఞాన యాత్రలో భాగంగా 9 వ రోజు సోమవారం తమిళనాడు లోని మదురై లో గల వ్యవసాయ సంబంధ సంస్థలను సందర్శించారు.

తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని మదురై లో గల ఏసీ ఆర్ఐ (అగ్రికల్చర్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ),ఇందులోని సమాచార కేంద్రం,నాబార్డ్ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న ఎంఏబీఐఎఫ్(మదురై అగ్రిబిజినెస్ ఇంక్యుబేషన్ ఫోరం) లు సందర్శించి అందులో కార్యకలాపాలను అవగాహన చేసుకున్నారు. ఉల్లిపాయ క్యూరింగ్, టెక్నాలజీ, ప్రముఖ వరి రకాలు పై నమూనాలను పరిశీలించారు. 

రైతు ఉత్పత్తిదారుల సంస్థ,వ్యవస్థాపకులు,నామమాత్రపు ధరలకు వారి ఆహార ఉత్పత్తులను ప్రాసెస్ చేయడంలో సహాయపడటానికి పాలు ప్రాసెసింగ్, ఐస్ క్రీం తయారీ, ఫ్లేకింగ్ మెషిన్, ప్యాకింగ్ మెషినరీ,మిరప తయారీ యంత్రం, రోటార్ మెషిన్ వంటి ఐదు వేర్వేరు ఆహార ఉత్పత్తులను ప్రాసెస్ చేసే యూనిట్లను పరిశీలించారు. ఇప్పటివరకు దాదాపు 400 ఆహార ఉత్పత్తుల స్టార్టప్‌లు ఈ కేంద్రంలో ఇంక్యుబేట్ చేయబడ్డాయి.ప్రస్తుతం ఇది స్వయం సమృద్ధిగా వర్ధిల్లుతోంది. ఈ విజ్ఞాన యాత్రకు టూర్ లీడర్లు గా స్థానిక వ్యవసాయ కళాశాల బోధనా సిబ్బంది డాక్టర్ టీ. శ్రావణ కుమార్, డాక్టర్ కే.శిరీష్, డాక్టర్ శ్రీ జన్, స్రవంతి లు వ్యవహరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -