– సర్పంచ్ లు గా నామినేషన్ లు సమర్పించిన దుర్గమ్మ,సీత లు
– పాల్గొన్న ఆయా పార్టీ జిల్లా నాయకులు పుల్లయ్య,ప్రభాకర్ లు
నవతెలంగాణ – అశ్వారావుపేట
మాస్ లైన్ (ప్రజా పంథా) బలపరిచిన సీపీఐ(ఎం) సర్పంచ్ అభ్యర్ధులు రెండో రోజు సోమవారం నామినేషన్ లు వేసారు. నందిపాడు, మల్లాయిగూడెం సర్పంచ్ లు గా కూరం దుర్గ,మొడియం సీత లు నామినేషన్ లను ఆర్ ఓ లు సరళ,కన్నె కంటి వెంకటేశ్వర్లు కు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్( ప్రజా పంథా) మాస్ లైన్ జిల్లా కమిటీ సభ్యులు గోకినపల్లి ప్రభాకర్,సీపీఐ(ఎం) జిల్లా కమిటీలు కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య,జిల్లా కమిటీ సభ్యులు పిట్టల అర్జున్,మండల కార్యదర్శి సోడెం ప్రసాద్ లు పాల్గొన్నారు.
పండు వారి గూడెం కు చెందిన సీత సీపీఐ(ఎం) పీఎం గా, మధ్యాహ్న భోజన వంట కార్మికురాలు గా పని చేస్తూ సీఐటీయూ రంగంలో మధ్యాహ్న భోజన వంట కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం పనిచేస్తున్నారు. తన వృత్తికి రాజీనామా చేసి నేడు సర్పంచ్ గా నామినేషన్ వేసారు. ఈమె భర్త దుర్గారావు పార్టీ మండల కమిటీ సభ్యుడిగా రైతుసంఘం బాధ్యులు గానూ ఉన్నారు. నందిపాడు కు చెందిన కూరం దుర్గ సైతం పార్టీ సభ్యురాలే. అనంతరం నాయకులు మాట్లాడుతూ స్థానిక ఎన్నికలు రాజకీయ అవగాహనతో వామపక్ష భావజాలం బలపడే అవకాశం ఉందని అన్నారు.


