Monday, December 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామ అభివృద్ధికై సర్పంచ్ గా మీ ముందుకు వస్తున్నా.. ఆశీర్వదించండి

గ్రామ అభివృద్ధికై సర్పంచ్ గా మీ ముందుకు వస్తున్నా.. ఆశీర్వదించండి

- Advertisement -

సర్పంచ్ అభ్యర్థి ఎడ్ల వెంకట్ రెడ్డి
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

భువనగిరి, మండలం లోని తిమ్మాపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా భువనగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆశీర్వాదంతో తిమ్మాపురం నుండి, వేల మంది ఓటరు మహాశా యులతో గ్రామ పెద్దలతో కలిసి ర్యాలీగా బయలు దేరి వడ పర్తి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ వేసిన అనంతరం, ఈ సందర్బంగా సర్పంచ్ అభ్యర్థి ఎడ్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతు తిమ్మాపురం,గ్రామం మొత్తం ముంపునకు గురి అయిందని చాలా, మంది నిరుపేద సన్నకారు, రైతుల భూములు నృసింహ, బస్వాపూర్ ప్రాజెక్ట్ లో పోయిందని అన్నారు.

ఇప్పటివరకు ప్రభుత్వం ఆదుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ లో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు అండగా ఉంటూ ప్రభుత్వం తో మాట్లాడి నిధులు మంజూరు చేయించడం తన బాధ్యత అన్నారు. తిమ్మాపురం గ్రామం లో రోడ్లు డ్రైనేజ్, వ్యవస్థ, వీధి లైట్లు లేక ప్రజలు అవస్థలు పడడం చూసి చలించ లేక ఊరి అభివృద్ధి కొరకు మీ అందరి సహకారం దీవెనలతో నేడు సర్పంచ్ గా నామినేషన్ వేయడం జరిగిందిని అన్నారు. గ్రామ సర్పంచ్ గా ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి భారీ మెజారిటీ తో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఖచ్చితంగా ఊరు అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తానని అన్నారు. ఈ నామినేషన్ ర్యాలీ లో ఓటర్లు, మాజీ సింగిల్ విండో చైర్మన్ ఎడ్ల సత్తి రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -