Tuesday, December 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రెచ్చగొట్టే పోస్టులు పెట్టవద్దు: పస్రా ఎస్ఐ

రెచ్చగొట్టే పోస్టులు పెట్టవద్దు: పస్రా ఎస్ఐ

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని పసర ఎస్ ఐ అచ్చ కమలాకర్ అన్నారు. మంగళవారం స్టేషన్ ఛాంబర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సోషల్ మీడియాలో ప్రత్యర్థులపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇతరుల మనోభావాలు దెబ్బ తినేలా దుష్ప్రచారం చేసే వ్యక్తులపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏదైనా ఇతరులకు హాని కలిగించే పోస్టులు షేర్ చేసిన నేరంగా పరిగణించి గ్రూప్ అడ్మిన్ ను కూడా బాధ్యులను చేసి కేసులు నమోదు చేస్తామన్నారు. పస్రా పోలీస్ స్టేషన్ పరిధిలో స్పెషల్ టీం లను ఏర్పాటు చేయడం జరిగిందని గ్రామాల్లోఎవరైనా గుడుంబా కాసినా, బెల్ట్ షాపులు నిర్వహించిన వారిపైన శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -