Tuesday, December 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నామినేషన్ వేసిన వారిపై బెదిరింపులకు పాల్పడితే చర్యలు

నామినేషన్ వేసిన వారిపై బెదిరింపులకు పాల్పడితే చర్యలు

- Advertisement -

– బిక్నూర్ ఎస్సై ఆంజనేయులు
నవతెలంగాణ –  కామారెడ్డి

సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానాలకు నామినేషన్ వేసిన వారిపై బెదిరింపులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బిక్నూర్ ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొదటి విడత ఎన్నికలలో భాగంగా భిక్నూర్ మండలంలో అన్ని గ్రామాలలో సర్పంచ్ , వార్డ్ సభ్యుల ఎన్నికకు నామినేషన్ ప్రక్రియ ముగిసిందనీ, నామినేషన్ల ఉపసంహరణ దశ కొనసాగుతుందనీ, మండలంలోని లక్ష్మీదేవన్పల్లి గ్రామంలో ఒక వర్గానికి చెందిన వ్యక్తులు సమావేశమై, కొందరు వ్యక్తుల నామినేషన్ విత్ డ్రావల్ కొరకు ఒత్తిడి చేస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు మంగళవారం ఆ గ్రామంలో వారితో నిర్వహించడం జరిగిందన్నారు.

ఎన్నికలలో ఏకగ్రీవం కొరకు వేలంపాటలు, నామినేషన్ వేసినవారిపై విత్ డ్రావల్ కొరకు బెదిరింపులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోబడును అని ఆ సమావేశంలో తెలపడం జరిగిందన్నారు. ఎన్నికలలో ఏ గ్రామంలో అయినా, ఎవరు ఏ విధమైన బెదిరింపులకు పాల్పడినా తగు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని,  ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి అందరూ సహకరించాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -