నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ పట్టణంలోని రెండో బైపాస్ రోడ్ చాకలి ఘాట్ల సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. బైక్ , ఆటో ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి కి తీవ్ర గాయాలు కావడంతో అపస్మారక స్థితికి వెళ్ళాడు. అప్రమత్తమైన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. కొద్దిరోజుల క్రితం ఇదే ప్రాంతంలో బైక్ అదుపుతప్పి కాలువలో పడిన ఘటనలో ఒక యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ కేసు నమోదు చేశారు. అధిక వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వేములవాడలో బైక్–ఆటో ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



