Tuesday, December 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వరి కొయ్యలు కాల్చటం భూమికి రైతుకూ నష్టమే

వరి కొయ్యలు కాల్చటం భూమికి రైతుకూ నష్టమే

- Advertisement -

ఏడిఏ శాంతి నిర్మల 
నవతెలంగాణ – బొమ్మలరామారం 

వరి కోతల అనంతరం మిగిలిపోయిన వరి కొయ్యలను రైతులు కాల్చటం వలన భూమిలో ఉండే సూక్ష్మ జీవులు చనిపోయి కర్బన శాతం పెంచే ప్రక్రియ తగ్గిపోతుందని యాదగిరిగుట్ట ఏడిఏ శాంతి నిర్మల రైతులకు వివరించారు. మంగళవారం మండలం లోని ధర్మారెడ్డి గూడెం లో వరి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి వరి కొయ్యల కాల్చివేత పై అవగాహన కల్పించారు. కాల్చటం రైతులకు తేలికైన పనే అయినా, భూమి గొడసబారటం,పర్యావరణ సమతుల్యత దెబ్బ తినటం జరుగుతుందన్నారు. వరి కోతల తర్వాత రెండు మూడు రోజులు నీటిలో నాన బెట్టిన భూమిని సింగిల్ సూపర్ పాస్పేట్ చల్లి కలియ దున్నుకుంటే తర్వాత పంటకు పచ్చిరొట్ట ఎరువుగా ఉపయోగపడుతుందని వివరించారు.అంతే గాక కర్బన శాతం పెంచుతుందని అన్నారు. ఈ కార్యక్రమం లో ఏఈ సీమ,రైతులు, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -