నవతెలంగాణ – వనపర్తి
ఎయిడ్స్ రహిత సమాజ స్థాపనకు ప్రతిఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినాన్ని పురస్కరించుకొని జిల్లాలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో హెచ్ఐవి బాధితులకు చికిత్స, సేవలు అందిస్తున్న సిబ్బందికి మంగళవారం జిల్లా కలెక్టర్ తన ఛాంబర్ లో ప్రశంసా పత్రాలను అందజేశారు. హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ఎయిడ్స్ రహిత సమాజ స్థాపనకు ప్రతిఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సాయినాథ్ రెడ్డి, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ మల్లికార్జున్, గంధం నాగరాజు, ఇతర అధికారులు తదితరులు ఉన్నారు.



