హీరో శ్రీ నందు నటిస్తున్న నూతన చిత్రం ‘సైక్ సిద్ధార్థ’. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ఈ సినిమాకి బ్యాకింగ్. వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో యామిని భాస్కర్ కథానాయికగా నటించగా, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్రలు పోషించారు. ఈనెల 12న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్‌ని లాంచ్ చేశారు. హీరో శ్రీ నందు మాట్లాడుతూ,’ఈ సినిమాకి మీలాంటి యువకుడి కథ అనే టాగ్లైన్ పెట్టాం. ఈ కథ కూడా ఇప్పుడున్న సొసైటీకి రిలేట్ అయ్యేలాగా యూత్‌కి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, డైరెక్టర్ సాయి రాజేష్, అనుదీప్ ఈ సినిమా చూసి చాలా అభినందించారు. సురేష్ బాబు చూసి వెంటనే సైన్ చేశారు.
నిర్మాతగా నేను ఫ్రాఫిట్‌లో ఉన్నాను. ఈ సినిమాని తీసుకున్న సురేష్ బాబు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇది టేబుల్ ప్రాఫిట్ ఫిలిం. ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తున్నా. ఈసారి విజయం మనదే. సినిమా చూడండి. ఫస్ట్ ఆఫ్ కొందరికి నచ్చుతుంది. సెకండాఫ్ అందరికీ నచ్చుతుంది. సినిమా మీకు నచ్చకపోతే ప్రెస్ మీట్ పెట్టి మరి మీకు క్షమాపణలు చెప్తాను. ఇది పొగరుగా చెప్పడం లేదు చాలా వినయంగా చెప్తున్నాను. ఒకవేళ ఫెయిల్ అయినా ఇక్కడే ఉంటా, సినిమాలు చేస్తాను. గెలిచే వరకు ప్రయత్నిస్తూనే ఉంటాను. అందరూ థియేటర్స్‌కి వచ్చి సినిమా చూడండి’ అని తెలిపారు. ‘ట్రైలర్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. నందు కసితో వర్క్ చేయడం వల్లనే ఇంత అద్భుతంగా వచ్చింది’ అని డైరెక్టర్ వరుణ్ రెడ్డి చెప్పారు.
యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యే సినిమా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



