సర్పంచ్‌కు 12,479
అత్యధికంగా నల్లగొండలో 883
అత్యల్పంగా ములుగులో 113
వార్డు స్థానాలకు 30,040 దాఖలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రెండో దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం సోమవారం అర్థరాత్రి వరకు కొనసాగింది. రెండో రోజు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రంలో 193 మండలాల్లోని 4,332 పంచాయతీలు, 38,342 వార్డులకు నిర్వహిచే ఎన్నికలకు సంబంధించి దాఖలైన నామినేషన్ల వివరాలను ఎన్నికల సంఘం అధికారులు సోమవారం వెల్లడించారు. మొదటి రోజు 2,976, రెండో రోజు 9,503 కలిపి మొత్తం సర్పంచ్ పదవి కోసం 12,479 నామినేషన్లు, వార్డు స్థానాలకు 30,040 నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్ పదవికి అత్యధికంగా నల్లగొండలో 883, ఆ తర్వాత సిద్దిపేటలో701, అత్యల్పంగా ములుగులో 113, జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లాలో 190 నామినేషన్లు దాఖలయ్యాయి.
38,342 వార్డు స్థానాలకు గాను 30,040 నామినేషన్లు వచ్చాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 2,070, ఆ తర్వాత సంగారెడ్డి జిల్లాలో 1,996, అత్యల్పంగా జోగులాంబ గద్వాల జిల్లాలో 341, ఆ తర్వాత నాగర్ కర్నూల్ జిల్లాలో 354 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండో విడత నామినేషన్ల దాఖలుకు నేడు చివరిరోజు కాగా, బుధవారం వాటిని రిటర్నింగ్ అధికారులు పరిశీ లించి గురువారం వెల్లడిస్తారు. కాగా రెండు రోజుల్లో సర్పంచ్ స్థానాలకు సగటున మూడు వరకు, వార్డు మెంబర్లకు ఒకటి కంటే తక్కువ నామినే షన్లు దాఖలయ్యాయి. కాగా బుధవారం మొదటివిడుత నామినేషన్ల ఉప సంహరణ అనంతరం తుది జాబితా ప్రకటించి, గుర్తులను కేటాయిస్తారు.



