Wednesday, December 3, 2025
E-PAPER
Homeరాష్ట్రీయండ్రగ్స్‌ మాఫియాను అరికట్టాలి

డ్రగ్స్‌ మాఫియాను అరికట్టాలి

- Advertisement -

పెంచలయ్యను హత్య చేసినవారిని కఠినంగా శిక్షించాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో డ్రగ్స్‌ మాఫియాకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్య వంతం చేసి, పోరాడుతున్న సీపీఐ(ఎం) నాయకుడు, ప్రజానాట్యమండలి కళాకారుడు కె.పెంచలయ్యను అతి దారుణంగా హత్య చేసిన ఘటనను సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన డ్రగ్స్‌ మాఫియా డాన్‌ కామాక్షి, ఆమె భర్తతో పాటు వారికి సహాయపడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేసింది. నెల్లూరు జిల్లా బంద్‌కు, రాష్ట్రవ్యాప్త నిరసనలకు సీపీఐ(ఎం) ఆంధ్రప్రదేశ్‌ కమిటీ ఇచ్చిన పిలుపులకు సంఘీభావం తెలిపింది. మంగళవారం ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు.

‘డ్రగ్స్‌ మాఫియాని అరికట్టడంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు పూర్తిగా విఫలమవుతున్నాయి. ప్రభుత్వాలు, అధికారులు, రాజకీయ నాయకుల అండదండలతో ఈ రాష్ట్రాల్లోని పట్టణాలు, గ్రామాల వరకు విచ్చలవిడిగా డ్రగ్స్‌ సరఫరా కొనసాగుతున్నది. ఈ మత్తులో కొందరు యువకులు అరాచకాలకు పాల్పడుతున్నారు. తెలంగాణలో డ్రగ్స్‌ను అరికట్టడంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కఠినంగా మాట్లాడుతున్నప్పటికీ, ఆచరణలో తీసుకుంటున్న చర్యలు సరిపోవట్లేదు. ప్రజలు, యువతను డ్రగ్స్‌కు దూరం చేసేందుకు ఇంకా చైతన్యం కల్పించాలి. ప్రభుత్వాలు మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోకపోతే, తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన అరాచకాలు, హత్యలు జరిగే పరిస్థితులు నెలకొనే ప్రమాదముంది. రెండు రాష్ట్రాల సీఎంలు ఇప్పటికైనా డ్రగ్స్‌ మాఫియాను ఉక్కుపాదంతో అణిచేందుకు కఠిన చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -