- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: యాదాద్రి జిల్లా రాజాపేట మండలం సాంఘిక సంక్షేమ గురుకులంలో ర్యాగింగ్ కలకలం రేగింది. అర్ధరాత్రి పదో తరగతి విద్యార్థి కౌశిక్‌పై 20 మంది ఇంటర్ విద్యార్థులు దాడి చేశారు. అడ్డువచ్చిన ఐదుగురిపై కూడా కర్రలతో దాడి చేసినట్లు జూనియర్ విద్యార్థులు తెలిపారు. ఈ దాడిలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలవడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. దీంతో బాధిత తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రిన్సిపల్, యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
- Advertisement -



